వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని లైసెన్సు పొందాలి-కేంద్ర మంత్రి
తిరుపతి: అంగళ్లలో తినుబండారాలు,వీధుల్లో ఆహార పదార్థాలు అమ్మే వారు కల్తీ లేని, శుభ్రమైన ఆహారం ప్రజలకు విక్రయించాల్సిన బాధ్యత ఉందని వీధి వ్యాపారులకు, ఎఫ్.బి.ఓ లను ఉద్దేశించి ఆయుష్, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ అన్నారు.ఆదివారం తిరుపతి కలెక్టరేట్ లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI),ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రత, ప్రమాణాలపై తినుబండారాల చిరు వ్యాపారులు మరియు వీధి వ్యాపారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్ట్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ ఇనిషియేటివ్ లో భాగంగా ప్రజలకు శుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు చేపట్టి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలు తీసుకునే ఆహారం శుచి శుభ్రత కలిగి, నాణ్యతగా ఉండేలా దేశవ్యాప్తంగా 100 స్ట్రీట్స్ ఫుడ్ హబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనీ, అందులో నాలుగు కడప, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని తెలిపారు.. తినుబండారాల వీధి వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని, లైసెన్సు పొందాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నవారికి, గతంలో ఉన్న 100 రూపాయల ఫీజును కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసి ఉచితం చేసిందన్నారు.