ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు-రూ.10 లక్షల జరిమానలు విధించిన RTO
25 బస్సులపై కేసుల నమోదు..
తిరుపతి: తిరుపతి నుంచి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం ఇతర దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఫిట్నెస్, పన్నుల చెల్లింపులు-ఇతర అనుమతులన్నిటిని పరిశీలించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ప్రయాణికుల సురక్షిత అంశాలను పరిగణనలో తీసుకొని నేషనల్ పర్మిట్ బస్సులకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉండేలా చూశారు. తిరుపతి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను అలాగే దూరప్రాంతాల నుండి తిరుపతికి వచ్చే బస్సులను అన్నింటి మీద నిఘా ఉంచి బళ్లారి నుంచి తిరుపతికి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్-టాక్స్ చెల్లించని కారణంగా స్వాధీన పరచుకుని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు.గత వారం రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ పై పలు రకాల కేసులు నమోదు చేయడం కాకుండా మొత్తం మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.మూడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అపరాధ రుసుము, ట్యాక్స్-పెనాల్టీ క్రింద 10 లక్షల రూపాయలు చెల్లించవలసి ఉంది.