బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి జరిమానా విధించండి-కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తూ వీధులను గార్బేజ్ పాయింట్లుగా మారుస్తున్న స్థానికులను గుర్తించి వారికి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణలో భాగంగా స్థానిక 4 వ డివిజన్ లో కమిషనర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, సూచికలు, ఇతర సైన్ బోర్డులను వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. రోడ్డు పక్కన వదిలేసిన విద్యుత్ స్తంభాలను ఆ శాఖ అధికారులతో సంప్రదించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని, నగరపాలక సంస్థ కు చెందిన పార్కు స్థలము లను గుర్తించి ప్రజలకు వినియోగంలోకి తీసుకొనిరావాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.