బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసే వారికి భారీ జరిమానాలు విధించండి-కమిషనర్
నెల్లూరు: ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు వ్యర్ధాలను అందజేయకుండా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై వ్యర్ధాలు వేస్తున్న వారిని గుర్తించి, వారికి భారీ జరిమానాలు విధించాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పర్యవేక్షణలో భాగంగా 14వ డివిజన్ స్థానిక బాలాజీ నగర్, ఏ.సీ. నగర్, ద్వారకమయి నగర్, శ్రీనగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్.వి.జి.ఎస్. కాలేజీ రోడ్డుపై చెత్త వేస్తున్న వాహనములు గుర్తించి పెనాల్టీలు విధించవలసినదిగా, అక్కడ చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు సీ.సీ. కెమెరాలు ఏర్పాటుచేసి, నిరంతర పర్యవేక్షణ జరిగేలా సిబ్బందిని నియమించాలని, కాలువల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి వారికి పెనాల్టీ విధించవలసినదిగా పారిశుద్ధ్య విభాగము అధికారులను ఆదేశించారు.