ఇంటి పన్నుల రివిజన్ సర్వేకు అత్యంత ప్రాధాన్యత కల్పించండి- కమిషనర్ నందన్
ఇంటి పన్నులు బాదుడికి సిద్దం…
గత ప్రభుత్వం హాయంలో పెంచిన అన్ని రకాల పన్నులతో సతమతం అయిన ప్రజలు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంకు పట్టాం కట్టారు.. కూటమి ప్రభుత్వం, ప్రజలకు నొప్పి తెలియకుండా ఏప్రిల నెల నుంచి స్టాంప్స్ & రిజస్ట్రేషన్ శాఖ ద్వారా ఇప్పటికే ఇళ్లు,,అపార్టుమెంట్ లు,,పొలాల కొనుగొళ్లపై రిజిస్ట్రేషన్ విలువ పెంచాశారు..మళ్లీ ఇప్పుడు ఇంటి పన్నుల రివిజన్స్ పేరుతో సామాన్య,,మధ్యతరగతి ప్రజలపైన భారం మోపేందుకు ప్రభుత్వం సిద్దం కావడం అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభం అవుతుంది అనేడంలో ఎలాంటి సందేహం లేదు???
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో ఇంటింటికి తిరిగి నిర్వహించే ఇంటి పన్నుల రివిజన్ సర్వేకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలని కమిషనర్ వై.ఓ నందన్ రెవెన్యూ అధికారులు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు సూచించారు..పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 22వ డివిజన్ పరిధిలో కమిషనర్ గురువారం పర్యటించారు.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు ప్రతి అడ్మిన్ కార్యదర్శి సచివాలయ ఇతర కార్యదర్శులను సమన్వయం చేసుకుని ఇంటింటి ట్యాక్స్ రివిజన్ సర్వే నిర్వహించాలని సూచించారు..అడ్మిన్ కార్యదర్శులు ప్రతిరోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పన్నుల సవరణల సర్వేను పూర్తి చేయాలని, రెవెన్యూ వసూళ్లలో గత ఆర్ధిక సంవత్సరం కన్నా మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు.