ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూత
అమరావతి: ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ(77) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు..ఇటీవల కుమారుడు విజయబాబు మృతితో పార్వతమ్మ మరింత కృంగిపోయారు. దిందో ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.. నేటి మధ్యాహ్నం పార్వతమ్మ భౌతికకాయాన్ని నెల్లూరులోని స్వగృహానికి తరలించనున్నారు.. అభిమానుల సందర్శనార్థం గురువారం వరకు స్వగృహంలోనే ఉంచనున్నారు..రేపు సాయంత్రం పార్వతమ్మ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.