అ:తర్గత నాటకీయ పరిణమాల తరువాత రెడ్ క్రాస్ కమీటి సభ్యుల ఎన్నిక
నెల్లూరు: నెల్లూరు (IRCS )రెడ్ క్రాస్ చైర్మన్ గా వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా చామర్తి జనార్దన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రతినిధిగా జిల్లా రెవెన్యూ అధికారి జె .ఉదయ భాస్కరరావు ఎన్నిక కార్యక్రమం గురువారం ఆయన ఛాంబర్లో నిర్వహించారు.9 మంది కమిటీ సభ్యులు హాజరయ్యారు.తొలుత రెడ్ క్రాస్ సెక్రటరీ మస్తానయ్య చైర్మన్ ,వైస్ చైర్మన్ పేర్లను ప్రతిపాదించవలసిందిగా. సభ్యులను కోరారు.చైర్మన్ పదవికి వాకాటి విజయ్ కుమార్ రెడ్డి పేరును గునుపాటి ప్రసాద్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే వైస్ చైర్మన్ పదవికి చామర్తి జనార్దన్ రాజు పేరు ను కలిగిరి శ్రీహరి ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు .ప్రస్తుతం ట్రజరర్ గా వ్యవహరిస్తున్న సురేష్ కుమార్ జైన్ ను కొనసాగించాలని సభ్యులు తీర్మానించారు. అనంతరం ఎన్నికైన చైర్మన్,వైస్ చైర్మన్ లను సభ్యులు అభినందించారు. గత ఛైర్మన్,,ప్రస్తుత వైసీపీ ఎమ్మేల్సీ పర్వతనేని.చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం వల్ల,,కొంతమంది సభ్యులను తొలగించడం వల్ల ఈ ఎన్నిక జరిగింది.
(మాజీ ఛైర్మన్,,ప్రస్తుత వైసీపీ ఎమ్మేల్సీ పర్వతనేని.చంద్రశేఖర్ రెడ్డి,,మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి అధికారపార్టీకి చెందిన నాయకులు తన చేత బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..అటు తరువాత జరిగిన పరిణమాల్లో రెడెక్రాస్ లో కొన్ని అవకతవకలు జరిగినట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంతో,,ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు..తదనంతరం అ:తర్గతంగా జరిగిన …….తో గత ఛైర్మన్ రాజీనామా చేశారు..)