రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో నిలిచిన నీరు-పరిశీలించిన కమీషనర్
కోటి 17 లక్షలతో అత్యంత ఆర్బటంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జిని 45 రోజులు మూసిన వేసిన అధికారులు,, కాంట్రాక్టర్లు రిపేర్లు చేశారు. ఒక్క చూక్క నీరు కూడా అండర్ బ్రిడ్జిలో నిలబడదని “ఘంటలు” వాయిస్తూ డంబాలు చెప్పుకుని వచ్చారు. నగర వాసులు తెగ సంబరా పడిపోయారు. రెండు రోజులు నుంచి విడత విడత కురుస్తున్న వర్షం దెబ్బతో,, రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఆసలు రంగు బయట పడింది.నగర ప్రజలు చెల్లిస్తూన్న “పన్నుల”కు రూ.కోటి 17 లక్షల రూపాయల బహుమతి. ఏం చెదాం..ఇంత కంటే వేరే దారి వుందా?? ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి రిపేర్లు పూర్తి అయ్యే లోపు వర్షకాలం గడిచి పోతుంది.దింతో అధికారులు,, కాంట్రాక్టర్లు హ్యాపీ…వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నగర ప్రజలకు కోట్ల రూపాయల బ్రిడ్జి రిపేర్లు డబ్బు (అదే మనం చెల్లిస్తూన్న“ పన్నులు“) గుర్తు వుంటాయా??
నెల్లూరు: గత రెండు రోజులు నుండి విడత విడతలు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఆత్మకూరు బస్టాండ్, విజయమహల్ గేటు,రామలింగాపురం, మాగుంట లేఔట్ బ్రిడ్జిలో నిలిచిన వర్షపు నీరును ఎప్పటికీ అప్పుడు యుద్ధప్రాతిపదికన మోటార్ల సహాయంతో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని నగరపాలక సంస్థ కమీషనర్ నందన్ అధికారులను అదేశించారు.గురువారం అయన బ్రిడ్జిలను పరిశీలించారు.వాహన చోదకులకు, ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవలసినదిగా ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

