DISTRICTS

ప్రతీ భవనానికి నిర్మాణ అనుమతులను పరిశీలించండి- కమిషనర్ వై.ఓ నందన్

కార్పరేషన్ లోని ఇంజనీరింగ్ అధికారులు,,భవంతులను నిర్మిస్తున్న సమయంలో వేలకు వేలు ముడుపులు తీసుకుని సహకరిస్తారు అనే ఆరోపణలు నగర ప్రజల నుంచి వున్నయన్నది నిజం కాదా? నిర్మాణ సమయంలోనే అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే,,ఇప్పుడు ఈ బాధలు ఎందుకు? కార్పరేషన్ లో ఉన్నతస్థాయిలో వున్న అధికారులు సైతం కొన్ని ఆనాధికార ఒత్తిడి(మ్యా..మ్యాలకు)కి లొంగి క్రింద స్థాయి సిబ్బందికి కొమ్ముకాస్తున్నరన్నది నిజం కాదా? కార్పరేషన్ కు వచ్చిన ప్రతి కమీషనర్ భవంతుల అనుమతుల విషయంలో ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం, ఇది చూసి నగర ప్రజలు భయపడడం,,మళ్లీ క్రింద స్థాయి సిబ్బంది మరి కొంత వసూళ్లు చేసుకొవడం సర్వసాధరణం అయిపోయింది..పోనీ ప్లాన్ కంటే భిన్నంగా నిర్మించారని అనుకుందాం? రాజకీయ ఒత్తిడిని తట్టుకుని కార్పరేషన్ అధికారులు భవనాలను కనీసం టచ్ చేయగలరా? కార్పరేషన్ లో ఉద్యోగుల పద్దతిని ప్రక్షాళన చేయాలి అనుకుంటే,,సదరు కమీషనర్ బదలీ కావడం షారా మాములే..ఏం చేస్తాం..ఏ ప్రభుత్వం మారిన అధికారుల తంతు ఇదే కదా..?

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతీ భవనానికి నిర్మాణ అనుమతులను పరిశీలించి, అనధికార, అక్రమ కట్టడాల వివరాలను నివేదించాలని కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ అన్ని విభాగాల తనిఖీలలో భాగంగా కమిషనర్ స్థానిక 18,19, 20 డివిజన్లు రామలింగాపురం, ముత్యాల పాలెం, గోమతి నగర్, శ్రీహరి నగర్, అరవింద్ నగర్, ఇస్కాన్ సిటీ తదితర ప్రాంతాలలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు.రీ సర్వే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క వార్డు సచివాలయ కార్యదర్శి తమ పరిధిలోని ఇంటింటికి తిరిగి భవనాల నిర్మాణ అనుమతులు, అసెస్మెంట్ డిమాండ్, తాగునీటి కుళాయి కనెక్షన్ తదితర వివరాలను పరిశీలించాలని, వివరాలన్నిటిని సమగ్రంగా ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో భవనాలను కమిషనర్ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ద్వారా కొలతలు వేయించి, ప్రస్తుత నిర్మాణాన్ని పట్టణ ప్రణాళిక విభాగం నుంచి తీసుకున్న నిర్మాణ అనుమతులతో పోల్చి చూశారు. నిర్మాణ కొలతలకు రెవెన్యూ విభాగం వారు అందించిన అసెస్మెంట్ డిమాండ్ ను సరి చూసారు.ఇస్కాన్ సిటీ ప్రాంతంలో నూతనంగా నిర్మాణమైన సిసి రోడ్డు నాణ్యతను కమిషనర్ తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని ఇతర సివిల్ వర్క్స్ అన్నిటిని నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *