Recent Posts

లాభాల బాటలో జిల్లా కొ ఆపరేటివ్ మార్కెంగ్ సోసైటీ-జె.సి హరింధ్రప్రసాద్

నెల్లూరు: 2021 సంవత్సరంలో జిల్లా కొ ఆపరేటివ్ మార్కెంగ్ సోసైటీ ద్వారా వరి ధాన్యపు కొనుగొలు కేంద్రాలు 20ను ఏర్పాటు చేసి వాటి ద్వారా 136 కోట్ల రూపాయల వరిధ్యాన్యం రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి,సేకరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)హరింధ్రప్రసాద్(IAS) తెలిపారు..గురువారం అయన మాట్లాడుతూ కొనుగొలు ద్వారా DCMS లాభాలు ఆర్జించిదన్నారు..గత సంవత్సరం (2020) సీజన్ లో 142 కోట్ల రూపాయల వ్యాపారం చేయడం జరిగిందన్నారు.ఈ సంవత్సరం రైతులకు ఆత్మకూరు,కావలి,కోవూరు,అనంతసాగరం, నాయుడుపేట, అందుబాటులో ఎరువులు వుంచడం జరిగిందని పేర్కొన్నారు..ఎరువులు హోల్ సేల్ వ్యాపారం ద్వారా 20-21 సం..లో 17 కోట్ల లావాదేవిలు జరిగాయన్నారు.గత సం..కరోనా బాధిత కుటుంబాలకు రూ.7 లక్షలు విలువ చేసే సరుకులు, కూరగాయాలు DCMS విరాళంగా అందించడం జరిగిందన్నారు.ఈ సం.. DCMS సాధించిన ప్రగతిని,లాభాలను దృష్టిలో వుంచుకుని,జిల్లా కలెక్టర్ కు రూ.20 లక్షలు విరాళంగా ప్రకటించి అందించడమైందన్నారు..ఈ నిధులను ప్రభుత్వవైద్యశాల్లో మెటర్నిటీ వార్డులో తగు వసతులు కల్పించేందుకు వినియోగిస్తారని తెలిపారు..

Spread the love