Recent Posts

జిల్లాలో వైయస్సార్ ఆసరా పథకం రెండో విడత క్రింద రూ.17.44 కోట్లుపంపిణీ-మంత్రి అనిల్

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం  ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో  వైయస్సార్ ఆసరా పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి,జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి అమ్మ ఒడి, చేయూత, జగనన్న ఇల్లు, వైయస్సార్ ఆసరా వంటి పథకాలను మహిళ పేరుతో అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పొదుపు మహిళా రుణాలు మాఫీ చేయలేదని, ఒక్క మన రాష్ట్రంలోనే వైయస్సార్ ఆసరా ద్వారా పొదుపు మహిళలకు రుణాలు మాఫీ చేసిన చరిత్ర  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టిడ్కో ఇళ్లను కూడా మహిళలకు ఉచితంగా విడతలవారీగా అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు ఒక్క రూపాయికే అందిస్తున్నామని, మిగిలిన ఇళ్లను సబ్సిడీ ధరకు అందజేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వైయస్సార్ ఆసరా, చేయూత పథకాలకు సంబంధించిన నగదును వ్యక్తిగత అవసరాలకు కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చిన్న చిన్న వ్యాపారాల కోసం పెట్టుబడిగా వినియోగించుకోవాలన్నారు. అనంతరం నెల్లూరు అర్బన్ పరిధిలోని 18555 మంది స్వయం సహాయక గ్రూపు సభ్యులకు సుమారు రూ.17.44 కోట్ల మెగా చెక్కును మంత్రి,కలెక్టర్ లు మహిళలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర, ఏ.పి. ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదల సుధీర్, మెప్మా సిబ్బంది, పలు పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు..

Spread the love