Recent Posts

తాలిబాన్ల చేతిలో ప్రాణలు కొల్పోయిన ఇండియా ఫోటో జర్నలిస్టు దినేశ్ సిద్ధికి

అమరావతి: ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ సంస్థలో చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తోన్న దినేశ్ సిద్ధికి(41) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే కాందహార్ లో కవరేజీకి వెళ్లిన ఆయన తాలిబన్ల చేతిలో హతమయ్యారు..అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత తాలిబన్ సేనల ఆక్రమణలోకి వెళుతోన్న అఫ్గానిస్థాన్ లో అశాంతి రాజ్యమేలుతున్నది. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి చూపించడానికి వెళ్లిన దినేశ్ సిద్ధికి దక్షిణ అఫ్గాన్ లోని కాందహార్ ఫ్రావిన్స్, స్పిన్ బోల్డాక్ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు..అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి మరణించారు.ఈ విషయాన్ని అఫ్గాన్ సేనలు, ఆ దేశ అధికారిక మీడియా టోలో న్యూస్ తోపాటు దినేశ్ పనిచేస్తోన్న రాయిటర్స్ సంస్థ కూడా ధృవీకరించింది. ముంబైకి చెందిన దినేశ్ సిద్ధికి చాలా ఏళ్లుగా రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీలో ఫొటోజర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇరాక్ సైన్యం-ఐసిస్ ఉగ్రవాదుల మధ్య జరిగిన మోసుల్ యుద్ధాన్ని, నేపాల్ భూకంపం, రోహింగ్యాల ఊచకోత, వలసలు, ఢిల్లీ ఘర్షణలు తదితర సందర్భాల్లో దినేశ్ తీసిన ఫొటోలు సంచలనం రేపాయి. జర్నలిస్టుల నోబెల్ పురస్కారంగా భావించే పులిట్జర్ అవార్డును సైతం సిద్ధికి గెలుచుకున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలో పనిచేస్తోన్న భారతీయ జర్నలిస్టుల్లో ప్రముఖుడిగా పేరున్న దినేశ్ సిద్దికి విధినిర్వహణలోనే తాలిబన్ల చేతులో మరణించడంపై జర్నలిస్టు లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది..

Spread the love