Recent Posts

35 నిమిషాల్లోనే 2.79 లక్షల సర్వదర్శనం టోకన్లు భక్తులు కొనుగొలు చేశారు-టీటీడీ

అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నరు అనేంది నిదర్శనం, ఆన్ లైన్ లో 35 రోజులకు సరిపడా టోకెన్లు టోకెన్లు విడుదల చేస్తే,కేవలం 35 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి..అంటే దాదాపు  2.79 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు టీటీడీ ప్రకటించింది,,ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో శనివారం విడుదల చేస్తున్నామని టీటీడీ ముందుగానే ప్రకటించి,సర్వర్లు క్రాష్ కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుని రోజుకు 8 వేల టికెట్లు చొప్పున ఆన్ లైన్ లో విడుదల చేశారు..ఈనెల 26 నుంచి అక్టోబర్‌ నెల 31 వరకు సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచింది.,వర్చువల్‌ క్యూ పద్దతి ద్వారా ముందుగా లాగిన్‌ అయిన వారికి అవకాశం కల్పించారు. వర్చువల్‌ క్యూ పద్దతి పాటించడంతో సర్వర్లు క్రాష్‌ అయ్యే ప్రమాదం తప్పి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు..ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీని నిలివేయనున్నారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ లేదా 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ సర్టిఫికెట్‌తో తిరుమలకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు..

Spread the love
error: Content is protected !!