Recent Posts

డేరా బాబాకు మరో హత్య కేసులో జీవిత ఖైదు విధించి కోర్టు

అమరావతి: శిష్యురాళ్లను అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా మరో హత్య కేసులో దోషిగా నిర్దారణ కావడంతో ఇతనితో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేలుస్తూ పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది..ఐదుగురికీ జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.డేరా బాబాకు రూ.31 లక్షల జరిమానా విధిస్తు,, మిగిలిన నలుగురికీ రూ.50 వేల చొప్పున జరిమానా వేసింది..డేరా బాబా తన శిష్యుడైన రంజిత్ సింగ్‌ను 2002 జులై 10న మరో ఐదుగురితో కలిసి హత్య చేశారు. దీనిపై రంజిత్ సింగ్ కొడుకు జగ్సీర్‌‌ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసి వదిలివేశారు.దినిపై అతని కుమారుడు స్థానిక పోలీసులపై నమ్మకం లేదంటు పై కోర్టుకు వెళ్లడంతో 2003 డిసెంబర్‌‌ 3న CBI FIR నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టింది. హర్యానాలోని పంచకులలో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.సుదీర్ఘ విచారణ తరువాత  న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

Spread the love
error: Content is protected !!