Recent Posts

పాకిస్తాన్ లో మరో హిందు దేవాలయం కూల్చివేత

అమరావతి: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైరస్ తో దేశాలు అతలకుతలం అవుతుంటే,,పాకిస్తాన్‌లో మాత్రం మతోన్మాదులు హిందు దేవాలయాలను కూల్చివేయడంలో ముందు వుంటున్నారు.. పాకిస్తాన్ లో హిందువులు మైనారిటీలుగా కాలం వెళ్లదీస్తున్నారు.వారికి అక్కడ వున్న హక్కుల సంగతి సరే సరి..ఒక‌ప్పుడు పంజాబ్,సింథ్ ప్రాంతంలో వేలాది దేవాల‌యాలు ఉండేవి.  స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత పాకిస్తాన్‌లోని వేలాది హిందూ దేవాల‌యాల‌ను కూల్చివేశారు.  హిందూ దేవాల‌య‌ల కూల్చివేసే పని ఇప్ప‌టికీ కొనసాగుతూనే వుంది.తాజాగా సింధ్ ప్రావిన్స్‌,హైదరాబాద్ లోని థాకోర్ గ్రామంలోని హిందూ దేవాల‌యాన్ని కొంత‌మంది కూల్చివేశారు. కూల్చివేత‌ను అడ్డ‌గించిన ముగ్గురు హిందూ మ‌హిళ‌ల‌పై దాడులు చేయ‌డంతో వారు గాయ‌ప‌డ్డారు.ఎవ‌రికి ఎలాంటి ఇబ్బందులు క‌లిగించ‌కుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నామ‌ని, అయితే స్థానికులు త‌మ‌పై దాడులు చేస్తు,,దేవాలయాలను కూల్చివేస్తున్నరని,అక్క‌డి హిందువులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది..

Spread the love
error: Content is protected !!