July 4, 2022

స్వదేశంలో తయారైన రెండు యుద్ధ నౌకలను ప్రారంభించిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

అమరావతి: స్వదేశంలో తయారైన రెండు యుద్ధ నౌకలను మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబైలోని మజగావ్ డాక్‌యార్డులో “సూరత్” “ఉదయగిరి” అనే స్వదేశీ నిర్మిత యుద్ధ నౌకలను ప్రారంభించారు.‘సూరత్’ యుద్ధ నౌక (P15B class)కు చెందినది..ఇది నాలుగో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్..‘ఉదయగిరి’ (P17A class)కు చెందిన రెండో స్టెల్త్ ఫ్రిగేట్..ఈ రెండిటి డిజైన్లను డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ రూపొందించగా,,వీటిని ముంబైలోని మజగావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది..ఈ సందర్బంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ కరోనా,, రష్యా-ఉక్రెయిన్  యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని,,ఇలాంటి సమయంలో భారత దేశం,ఆత్మనిర్భర్ భారత్ లో బాగంగా నౌకల నిర్మాణంపై దృష్టి సారించిందని తెలిపారు..విశాలమైన భారతదేశ సముద్ర తీర ప్రాంతంను కాపాడుకునుందకు,,సముద్రంలో యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,,ఇందుకు నిదర్శనమే ఈ యుద్ధ నౌకలని అన్నారు..ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారత నావికా దళానికిగల వ్యూహాత్మక అవసరాలను తీర్చడం కోసం కృషి చేస్తున్న మజగావ్ డాక్స్ లిమిటెడ్‌ ను ప్రశంసించారు..

Share
error: Content is protected !!