Recent Posts

సముద్రపు సహజ కోత కారణంగా కూలిపోయిన “డార్విన్ ఆర్చ్”

అమరావతి: ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రసిద్ధ పర్యాటక రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కుప్పకూలింది.. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని గాలా పోగోస్ ద్వీపకల్పంలో “డార్విన్ ఆర్చ్” సోమవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు..సహజ సిద్ధమైన రాతికట్టడంగా పేరుగాంచిన డార్వాన్ ఆర్చ్ ప్రకృతి రమణీయతను కోల్పోయింది..ప్రకృతి సిద్దంగా రెండు స్తంభాలతో ఆర్చ్ గా  ఏర్పాడిన ఈ కట్టడం మొడివారి పోయినట్లు కనిపిస్తోంది..తూర్పు ద్వీపానికి 600 మైళ్ల దూరంలో ఉన్న డార్విన్ ఆర్చ్ కుప్పకూలిపోవడానికి సముద్రపు సహజ కోత కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

Spread the love