Recent Posts

వాతావరణ మార్పులపై భవిష్యత్ తరానికి పాఠ్యాంశాలు భొధించాలి-ప్రధాని మోదీ

అమరావతి: స్కాట్లాండ్‌లో గ్లోబల్‌ క్లయిమేట్‌ 26వ శిఖరాగ్ర సదస్సును బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రారంభించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ జల,వాయువులో వస్తున్న మార్పులు ప్రపంచంను ఆందోళనకు గురుచేస్తున్నాయని, ప్రస్తుతం భూమి విధ్వంసానికి కేంద్రంగా మారిందన్నారు..ప్రస్తుతం భూమి పరిస్థితి సినిమాల్లో చూపించే కాల్పనికంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు..ప్రకృతికి విరుద్ధంగా మానవళి చేపడుతున్న చర్యలను అన్నింటిన్ని ఇప్పటికైనా నిలిపివేయాలని కోరారు..ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఏంటోనియో గుటేరస్ మాట్లాడుతూ ప్రకృతికి హాని కలిగించడం ద్వారా మన గోతులను మనమే తవ్వుకుంటున్నామని పేర్కొన్నారు… ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తు,,ఇప్పటికైనా మానవళి మేల్కొని సరైన మార్గంలో వెళ్లాలని,,భవిష్యత్ తరానికి ప్రకృతి సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశాల్లో వాతావరణ మార్పులపై జరిగే పరిణామాలను చేర్చాల్సిన అవసరం ఉందన్నారు..భారత దేశంలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల వల్ల,పౌరులకు ప్రయోజనాలు కల్పిస్తూనే,ప్రజల జీవన ప్రమాణాల నాణ్యతను మెరుగుపరిచామని తెలిపారు..తొలుత ప్రధాని మోదీ,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో భేటి అయ్యారు.ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, ద్వైపాక్షిక సంభంధాలపై చర్చించారు.CAP-26వ సమ్మిట్‌లో భారత్ ప్రధానితో పాటు 120 దేశాల ప్రభుత్వ అధినేతలు పాల్గొన్నారు.ప్రధాని మోదీ,స్కాట్లాండ్‌లో నివాసిస్తున్న ప్రవాస భారతీయులను కలుసుకుని,,వారితో కొద్దిసేపు ముచ్చటించారు..ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని మోదీ అభినందించారు..

Spread the love
error: Content is protected !!