Recent Posts

కరోనా వైద్య చికిత్సలకు ఫీజులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు- సింఘాల్

అమరావతి: కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు.. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 24 గంటల్లో 84,224 శాంపిళ్లు టెస్టులు చేయగా, 16,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 104 మంది మృతి చెందారని తెలిపారు. గతంలో కంటే నేడు తక్కువ పాజిటివ్ రేటు నమోదయ్యిందన్నారు..అధికంగా ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు:- కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే అధికంగా వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సింఘాల్ హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులపై పెనాల్టీ విధించామన్నారు..ఇటీవలే కరోనా వైద్య చికిత్సలకు అందజేసే ఫీజుల రేంటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే ఏపీలో పెంచిన ఫీజులు రీజనబుల్ గా నిర్ణయించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకు కూడా పెంచిన ఫీజులనే చెల్లిస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే బిల్లులను నోడల్ అధికారులు, వారి బృందాలు మానటరింగ్ చేయాలని అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కంటే అధికంగా వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.

Spread the love