Recent Posts

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిలు నిరాకరించిన కోర్టు

అమరావతి: నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో బెయిలు మంజూరు చేసేందుకు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం సాయంత్రం తిరస్కరిస్తు,,బెయిలు దరఖాస్తుకు విచారణార్హత లేదని తెలిపింది..ఈ కేసులో ఇతర నిందితులు అర్బాజ్, మున్మున్‌లకు కూడా బెయిలును తిరస్కరించింది..ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలను సోమవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు..బెయిలు కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని పేర్కొంది..ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేస్తే తమ దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడతాయని,,సాక్ష్యధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని,,సాక్షులను ప్రభావితం చేయవచ్చుని NCB కోర్టుకు తెలిపింది..అలాగే నిందితులంతా సమాజంలో పలుకుబడిగలవారని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు విన్పించారు..ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్ లను పరిశీలిస్తే,ఆయనకు ఇంటర్నేషనల్ డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడవుతోందని NCB కోర్టుకు తెలిపింది..

Spread the love