Recent Posts

YouTube వీడియోలను చూసి దొంగనోట్లను ముద్రిస్తున్న దంపతులు అరెస్ట్

హైదరాబాద్: వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న భార్య,భర్తలను ఆరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్ వీరి వద్ద నుంచి దాదాపు రూ.10 లక్షల రూపాయల దొంగనోట్లను సీజ్ చేసినట్లు వరంగల్ కమీషనర్ తరుణ్ జోషీ తెలిపారు..బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ వరంగల్ కాశిబుగ్గ ప్రాంతంలోనే చికెన్ సెంటర్ తో పాటుగా ఫ్యాన్సీ షాపు మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్న రమేష్,,సరస్వతి దంపతులకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో YouTube లో దొంగ నోట్లు ఎలా ముద్రించాలో  వీడియోలు ఒకటికి పది సార్లు చూసి ప్రణాళిక సిద్దం చేసుకున్నారు..మార్కెట్ లో లభిస్తున్న లేటెస్ట్ లేజర్ ప్రింటర్,,స్కానర్,,బాండ్ పేపర్స్ ను కొనుగొలు చేశారు..ఇక్కడి నుంచి వీరి దందా ప్రారంభంమైంది…ముద్రించిన నకిలీ కరెన్సీని ఎవరికి అనుమానం రానివిధంగా హన్మకొండ, వరంగల్ మార్కెట్స్ లో రద్దీగా వుండే షాపుల్లో నకిలీ నోట్లను ఈ కిలాడీ దంపతులు చెలామణీ చేసేవారు.గత కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లుగా పలు ఫిర్యాదులు రావడంతో ఆప్రమత్తమైన పోలీస్ శాఖ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపింది..విశ్వనీయ సమాచారం అందడంతో,టాస్క్ ఫోర్స్ పోలీసులు,,కీలాడీ దంపతుల ఇంటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో,దొంగనోట్లు బయటపడ్డాయి..వీరి వద్ద నుంచి 2 వేలు నోట్లు 376,,500 నోట్లు 204, 200 నోట్లు 420, 100 నోట్లు 471, యాభై,,ఇరువై,, పదిరూపాయల నోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు..

Spread the love