AMARAVATHI

జూన్ 2లోగా కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను జూన్ 2లోగా పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ అధికారులకు సూచించారు. గురువారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో బారికేడింగ్ ఏర్పాటు, పటిష్ట పోలీసు బందోబస్తు, నిరంతరం విద్యుత్ సరఫరా, వాహనాల పార్కింగ్, తాగునీరు, భోజన వసతి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, మీడియా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, నెల్లూరు సిటీ రిటర్నింగ్ అధికారి వికాస్, కోవూరు, నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారులు సేదు మాధవన్, మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, నుడా వీసీ బాపిరెడ్డి, డిఆర్ఓ లవన్న, అడిషనల్ కమిషనర్ శర్మద, ఎస్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీగా విచారించండి-తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.. జగన్ కేసులకు…

8 hours ago

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు…

8 hours ago

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

నెల్లూరుకు ఒ.ఆనంద్.. అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్​లను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. శ్రీకాకుళం…

1 day ago

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి: డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్.వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా…

1 day ago

రూ.249కి కొత్త ప్లాన్ ప్రవేశ పెట్టిన BSNL

అమరావతి: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ (BSNL) వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒక కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.. దీని…

1 day ago

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

2 days ago

This website uses cookies.