Recent Posts

కేరళలో కరోనా వైరస్ మళ్లీ విజృంభణ

అమరావతి: కేరళలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతు వస్తుంది.గడిచిన 24 గంటల్లో కేరళలో 22,129 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు,156మరణాలు నమోదైనట్లు మంగళవారం కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది.కొత్త కోవిడ్ కేసుల్లో 116మంది హెల్త్ వర్కర్లు కూడా ఉన్నరని,ఇందులో అత్యధిక మంది కన్నూర్ కి చెందినవారని తెలిపింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,79,130 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించినట్లు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది.టెస్ట్ పాజిటివిటీ రేటు 12.35 శాతంగా ఉందని,అత్యధికంగా మలప్పురం జిల్లాలోనే 4037 కోవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది.గడిచిన 24 గంటల్లో 13,415మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని పేర్కొంది.

Spread the love