Recent Posts

కరోనా వ్యాక్సిన్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాలి-ప్రధాని మోదీ

అమరావతి: కరోనా వ్యాక్సిన్‌లను ప్రస్తుతం ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాల్సిన అవసరముందని,( హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా) స్ఫూర్తితో వ్యాక్సిన్ లు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు..అలాగే వ్యాక్సిన్ సెకండ్ డోస్‌పై సమాన దృష్టి పెట్టాలని..లేకుంటే ఇన్ఫెక్షన్ కేసులు తగ్గడంతో నిర్లక్ష్యం ప్రారంభంమౌవుతుందన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని మోదీ హెచ్చరించారు.బుధవారం ప్రధాని మోదీ..జీ20, కాప్26 సదస్సులకు హాజరైన,,భారత్​ కు తిరిగి వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ పంపిణీ తక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు,,అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో మొదటి డోసు కవరేజీ 50 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహిస్తే మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఉందన్నారు.వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదన్నారు.వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు గ్రామ, పట్టణాల స్థాయిలో వినూత్న పద్ధతులు పాటించి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అధికారులకు మోదీ సూచించారు.గ్రామ స్థాయిలో 20-25 మందితో బృందాలు ఏర్పాటు చేయవచ్చన్నారు.ఇప్పటివరకు వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి,సురక్షితంగా వ్యాక్సిన్స్ లు ఇచ్చారని,,వ్యాక్సిన్ పంపిణీలో అపోహలు, పుకార్ల రూపంలో సవాళ్లు ఎదురవుతాయని,ఈ నేపథ్యంలో వీలైనంత మందికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఇందుకోసం స్థానిక మతపెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు..జార్ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్​ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు..వ్యాక్సిన్ పంపిణీ తక్కువగా ఉన్న 40 జిల్లాల్లో చాలా వరకు ఈ రాష్ట్రాలకు చెందినవే కావడం గమనార్హం..

Spread the love
error: Content is protected !!