Recent Posts

కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం కేవలం పిల్లలపై మాత్రమే వుంటుంది అనడం-కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు

అమరావతి: కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం కేవలం పిల్లలపై మాత్రమే వుంటుందనంటు వస్తున్న పుకార్లపై కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు, నీతీ అయోగ్‌ మెంబర్‌ వీకే పాల్‌  స్పందిస్తు ఏ వేవ్‌ కూడా ప్రత్యేకంగా పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఆధారల్లేవని ఆయన స్పష్టం చేశారు..‘కరోనా కేసులు చిన్న పిల్లల్లో పెరుగుతుండంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారని,, అయితే పిల్లలపై కరోనా వేవ్‌ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు’ అని ఆన్నారు..‘పెద్దవాళ్లల్లో సిరోప్రివలెన్స్‌ ఎలా ఉందో పిల్లల్లోనూ అలానే ఉందని,, పెద్ద వాళ్లలాగే పిల్లలు కూడా కరోనా బారిన పడే ఛాన్స్‌ ఉంటుంది తప్ప ప్రత్యేకంగా పిల్లలపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు అని తెలిపారు.. ఇండియన్‌ పీడియాట్రిక్‌ అసోసియేషన్‌:-మళ్లీ కరోనా వేవ్‌ వస్తే,, అది పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి సైంటిఫిక్‌ ఆధారాలు లేవని ఇండియన్‌ పీడియాట్రిక్‌ అసోసియేషన్‌ తెలిపింది..వ్యాక్సిన్‌ విషయంలో తల్లిదండ్రులు సంకోచించవద్దని,,తల్లి,తండ్రులు వ్యాక్సీన్  వేసుకోవడం వల్ల పిల్లల్లో వైరస్‌ వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకోవచ్చన్నారు..  

Spread the love