Recent Posts

2 కోట్లు దాటిన కరోనా టెస్టులు-పాజివిటీ రేటు 8.69 శాతం మాత్రమే-సింఘాల్

అమరావతి:  కరోనా ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,00,39,764 శాంపిళ్లు టెస్టు చేశామని, దేశ వ్యాప్తంగా చూస్తే ఏపీలోనే అధికంగా టెస్టులు నిర్వహించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు..బుధవారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ గడిచిన 24 గంటల్లో 93,511 శాంపిళ్లు టెస్టు చేయగా, 8,766 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 67 మంది మృతి చెందారని తెలిపారు.. మే 17వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయన్నారు. మే 17 నాటికి 2,11,554 కరోనా కేసులు ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. తగ్గుతున్న కరోనా పాజిటివిటీ రేటు:-మే 16వ తేదీ నాటికి కరోనా పాజిటివిటీ రేట్ 25.56 శాతంగా ఉండగా, ప్రస్తుతం 9.37 శాతానికి పడిపోయిందన్నారు. మంగళవారం(జూన్ 8) ఇంకా తక్కువగా 8.69 శాతం కరోనా పాజిటివిటీ రేట్ నమోదయ్యిందన్నారు. మే ఏడో తేదీకి రికవరీ రేటు 84.32 శాతంగా ఉండగా, ప్రస్తుతం 93.05 శాతానికి పెరిగిందన్నారు.

Spread the love