Recent Posts

కరోనా రోగులకు ఇక నుంచి ప్లాస్మా థెరపీ పద్దతిలో చికిత్స ఇవ్వకూడదు, ICMR

అమరావతి: కరోనా సెకండ్ వేవ్ నిలువరించేందుకు ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..కోవిడ్ రోగులకు అందించే చికిత్స విధానాల్లో మార్పులు చేస్తు,,కోవిడ్‌ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పించింది..కరోనా రోగులకు ఇక నుంచి ప్లాస్మా థెరపీ పద్దతిలో చికిత్స ఇవ్వకూడదని స్పష్టం చేసింది..ఈ మేరకు ఎయిమ్స్,,ICMR,,కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి..గత సంవత్సరం కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి,,పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితులకు ఎక్కించేవారు..తద్వారా అతడి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని డాక్టర్లు చెప్పారు..కానీ విధానం పెద్దగా సానుకూల ఫలితాలు లేకపోవడంతో ప్లాస్లా థెరపీని పక్కన పెట్టారు..కొత్త మార్గదర్శకాల ప్రకారం శ్వాసం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే స్వల్ప లక్షణాలుగా భావించాలని,,అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందించాలని సూచించింది..

Spread the love