Recent Posts

వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి-సింఘాల్

ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం..

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల(పీఎస్ఏ ప్లాంటు) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, కరోనా నియంత్రణకు రాష్ట్ర పభుత్వం తీసుకుంటునే చర్యలే కారణమని తెలిపారు. వ్యాక్సినేషన్ సందర్భంగా టీకా దుర్వినియోగమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 24 గంటల్లో 79,564 శాంపిళ్లు టెస్టుల చేయగా, 13,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 104 మంది మృతి చెందారని తెలిపారు..రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం:- అన్ని జిల్లాల్లో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని సింఘాల్ తెలిపారు..తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, కర్నూల్, అనంతపురం జిల్లాలతో పాటు గుంటూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం… ఇలా అన్ని జిల్లాలోనూ కరోనా కేసులు తగ్గాయని తెలిపారు. కరోనా పాజటివ్ రేటును పరిశీలిస్తే…పాజిటివీటి రేట్ మే 3వ తేదీ నుంచి మే 16 తేదీ వరకూ 25.5 శాతానికి పెరిగి అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందన్నారు. శనివారం నాటికి(మే 29) 17.29 శాతానికి తగ్గిందన్నారు. రికవరీ రేటును పరిశీలిస్తే… ఏప్రిల్ 16 నుంచి 95.46 శాతంగా ఉందని, అప్పటి నుంచి కేసులు పెరిగాయని తెలిపారు. మే 7వ తేదీనాటికి 84.32 శాతానికి పడిపోయిందన్నారు. అప్పటి నుంచి రికవరీ రేటు పెరుగుతూ వచ్చిందని, శనివారం నాటికి(మే 20) 89 శాతంగా నమోదయ్యిందని తెలిపారు..వ్యాక్సినేషన్ దుర్వినియోగమైతే కఠిన చర్యలు:- కరోనా వ్యాక్సినేషన్ దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా వేయాల్సిందేనని స్పష్టం చేశారు. గడిచిన రెండ్రోజుల్లో 10 లక్షల మందికి  వ్యాక్సిన్ వేశామన్నారు. గురువారం 5 .60 లక్షల మందికి, శుక్రవారం 4.33 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. మే 28 నాటికి రాష్ట్రంలో 5,21,210 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో కొవిషీల్డ్ 3,20,390 డోసులు, కొవాగ్జిన్ 2,00,820 డోసులు ఉన్నాయన్నారు. ఆదివారం మధ్యాహ్నానికి ఈ డోసులు వేసేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నుంచి జులై 15వ తేదీలోగా 6.99 లక్షల కొవిషీల్డ్ డోసులు రావాల్సి ఉందని, ఇదే విషయం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపామని వెల్లడించారు. నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 94,74,745 టీకాలు పంపిణీ చేశామని, వాటిలో రెండు డోసులను 24,12,876 మందికి, మొదటి డోసు 46,48,993 మందికి వేశామన్నారు.  

Spread the love