Recent Posts

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణం-టీటీడీ ఛైర్మన్

తిరుపతి: ఆంధ‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 500 ఆలయాలను ఏడాదిలోగా నిర్మించాల‌ని పాల‌క‌మండ‌లి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. శనివారం జ‌రిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు..పాల‌మండ‌లిలో చ‌ర్చించిన అంశాలు..తీసుకున్న నిర్ణ‌యాల‌ను   చైర్మన్ మీడియాకు తెలియచేశారు..ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలను నిర్మిస్తున్నామ‌ని,,జమ్మూలో 62 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆల‌యాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామ‌న్నారు.. త్వరలోనే ముంబై, వారణాసిలో కూడా టీటీడీ ఆలయాల నిర్మాణం చేపడతామ‌ని,, సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి క‌మిటీ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు..తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొల‌గించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నదని,,ఆంధ్రప్రదేశ్ లో13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు..తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్ర‌క‌టించడం జరిగిందని,, ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని తెలిపారు.. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని వెల్ల‌డించారు..శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని ఛైర్మన్ వై.వి తెలిపారు..

Spread the love