Recent Posts

జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించడం కాంగ్రెస్‌ కు సాధ్యం కాదు-గులాం నబీ ఆజాద్‌

అమరావతి: జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించడం కాంగ్రెస్‌ కు సాధ్యం కాదని ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు.. ఎందుకంటే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది జరిగే పనికాదన్నారు..అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్‌ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు.‘మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 300 మంది ఎంపీలు అవసరమని,, 2024 ఎన్నికల్లో 300 మంది ఎంపీలు గెలుపొందాలి. అప్పుడే ఆర్టికల్‌ 370ని పునరిద్ధరించగలం.అంత మంది ఎంపీలు గెలిచేదేప్పుడు..? ప్రస్తుతం ఆ పరిస్థితి కాంగ్రెస్‌లో కనిపించడం లేదు.అందుకే అధికరణ 370ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేయలేను’ అని ఆజాద్‌ వ్యాఖ్యానించారు.దీంతో కాశ్మీర్‌లో కాంగ్రెస్‌ ఓట్లను కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.ఇప్పటికైన కాంగ్రెస్‌ గత వైభవాన్ని సాధించలేకుంటే భవిష్యత్ లో కష్టతరంగా మారుతుందఅన్నారు. కేవలం ఒక్క జమ్ము కాశ్మీర్ మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ పట్టును కోల్పోతుందని వ్యాఖ్యానించారు.దేశంలో బీజేపీని ఎదుర్కొవడానికి యూపీయే కూటమి పోరాడాల్సి ఉన్నా,, ప్రస్తుత అలాంటి పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు.

Spread the love
error: Content is protected !!