Recent Posts

కేరళలో శని,ఆదివారల్లో పూర్తిగా లాక్ డౌన్

అమరావతి: దేశంలో కరోనా వైరస్ తగ్గినట్లే కన్పించిన మళ్లీ విజృంభిస్తోంది.గత వారం రోజులుగా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.దింతో పలు రాష్ట్రాలు మళ్లీ నిబంధనలు అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించి,,ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది..శని,ఆదివారల్లో విధించే లాక్ డౌన్ కు జూన్ 12,13 తేదీల్లో విధించిన లాక్డౌన్ మార్గదర్శకాలే వర్తిస్తాయని తెలియచేస్తు ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఆ రెండు రోజులు మూసివేయనున్నట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది..23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల  కరోనా శాంపిల్స్ పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన నింబంధనలు ఆమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 

Spread the love