Recent Posts

4,26,565 ఎకరాలకు,46 TMCల నీటిని కేటాయిస్తూ కమిటి తీర్మానం-మంత్రి కాకాణి

నెల్లూరు: జిల్లాలోని సాగు, త్రాగునీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని ప్రణాళికాబద్దంగా 2022 సం..రబీ 2వ పంట సాగుకు సంబందించి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించడం జరుగుతుందని రాష్ట్రవ్యవసాయ, శాఖ మంత్రి కాకాణి.గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ  జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల కింద ఆయకట్టుకు సంబందించి 2వ పంటకు సాగునీరు అందించేందుకు ఈ రోజు జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో 4,26,565 ఎకరాలకు సంబందించి 46 టి.ఎం.సి.ల నీటిని కేటాయిస్తూ కమిటి తీర్మానించడం జరిగిందన్నారు..ఈ సమావేశంలో  శాసన సభ్యులు,  నీటి సంఘాల సభ్యులు  సూచనలు, సలహాల ఇవ్వడం జరిగిందని, వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని  రైతాంగానికి అవససరమైన సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..జిల్లాలో ప్రతిపాదించిన సాగునీటి కెనాల్స్ మరమ్మతులు, పూడికతీత పనులు త్వరగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.. కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ,  గడిచిన రెండు సంవత్సరాల్లో  కోవిడ్ కారణంగా  జిల్లా సాగు నీటి సలహా బోర్డు సమావేశం జరగలేదన్నారు.మొదటి నుంచి జిల్లాలో వరి సాగుకు ప్రత్యేక స్థానం, గుర్తింపు వుందన్నారు.150 టి.ఎం.సి.ల  గరిష్ట సామర్ధ్యం కలిగి సోమశిల, కండలేరు జలాశయాలు జిల్లాలో వున్నాయని,   జిల్లాలో 2వ పంటకు సాగునీటిని కేటాయించేందుకు సోమశిల జలాశయం కింద మొత్తం 2.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు 28.400 టి.ఎం.సి.ల సాగునీటి కేటాయింపుకు, అలాగే కండలేరు జలాశయం కింద నెల్లూరు, తిరుపతి జిల్లాలో గల 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించుటకు 6 టి.ఎం.సి ల నీటిని  కేటాయించేలా ఈ సమావేశంలో ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

Spread the love
error: Content is protected !!