Recent Posts

ఉలవపాడు మండల పరిధిలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్,ఎమ్మేల్యే

నెల్లూరు:  వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని కోటిరెడ్డికుంట, మన్నేటికోట సమీపంలోని తిరుపతికుంట గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతంలో ఇళ్లు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు..గురువారం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండల పరిధిలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట.మహీధర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పర్యటించారు..గత మూడు రోజులుగా భారీగా కురిసిన వర్షాలకు ఉలవపాడు మండలంలో ముంపునకు గురైన కోటిరెడ్డి కుంట, తిరుపతి కుంటను సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యే గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు..తమకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు కలెక్టర్, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు సమయంలో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు శాశ్వతంగా వారికి అనుకూలమైన ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు..అనంతరం వారు కోటిరెడ్డి కుంట నిర్వాసితులకు ఉలవపాడు ఎంపిడిఓ కార్యాలయంలో, తిరుపతి రెడ్డి కుంట గిరిజనులకు జీవీఆర్ ఎస్టి కాలనీలోని సామాజిక భవనంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి బాధితులకు అందిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు..కలెక్టర్ వెంట కందుకూరు ఆర్డీవో శ్రీమతి ఉమాదేవి, ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి మంద రాణి, ఉలవపాడు తాసిల్దార్ సంజీవ రావు, ఎంపీడీవో శ్రీమతి చెంచమ్మ తదితరులు ఉన్నారు..

Spread the love
error: Content is protected !!