Recent Posts

కావలి వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్

1002కి తగ్గిన కేసులు..

నెల్లూరు:  జిల్లాలో గత 24 గంటల వ్యవధిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1002కి తగ్గింది..నిన్న ఇదే సమయానికి 1926గా వున్నది…అలాగే కావలి నియోజకవర్గం పరిధిలోని మద్దూరుపాడు వద్ద టిడ్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ని గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు సందర్శించారు..కోవిడ్ కేర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలు, వసతి సదుపాయాలను పరిశీలించారు. కోవిడ్ కేర్ సెంటర్ లోనే ఎక్స్ రే మిషన్, కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసే ల్యాబ్, అత్యవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశామని.., ప్రస్తుతం 100 మంది కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారని అధికారులు కలెక్టర్ కి వివరించారు. ఆక్సిజన్ బెడ్స్, ఎక్స్ రే మిషన్, రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించిన కలెక్టర్, 1000 మంది వరకూ కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స అందించడానికి సన్నద్ధమవ్వాలని ఆదేశించారు. రోగులకు చికిత్స అందించే కేస్ షీట్ ని పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన వారికి ఆక్సిజన్ బెడ్స్ కేటాయించాలని, మైల్డ్ లక్షణాలు ఉన్న వారికి హోం ఐసోలేషన్ సదుపాయం ఉంటే వారిని ఇంటికి పంపించాలన్నారు. ప్రతిరోజూ కోవిడ్ కేర్ సెంటర్ లో వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించి, నెగటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపించాలని, ఆ బెడ్స్ ను ప్రణాళిక ప్రకారం కోవిడ్ పాజిటివ్ పేషంట్స్ కి అందించాలన్నారు..ఈ పర్యటనలో కావలి ఆర్.డి.ఓ శ్రీనివాసులు, కోవిడ్ కేర్ సెంటర్ వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..

Spread the love