Recent Posts

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ కోటీ సంతకాల సేకరణ

అమరావతి: గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ, గోవుల సంరక్షణ కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమించాలని నిర్ణయించిన యుగతులసి ఫౌండేషన్ కార్యక్రమాన్ని తిరుమలలో శ్రీవారి సన్నిధి నుండి శ్రీకారం చుట్టింది..గోవుల హింస ఆపాలని,గోవుల హత్యలు నిషేధించాలని,, కబేళాలు మూసి వేయాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి చేపట్టిన గోవిందుని సాక్షిగా గోవు కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురువారం తిరుమల శ్రీవారి సన్నిధి నుండి ప్రారంభమైంది..గురువారం నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకూ నిర్వహించనున్న ఈ సంతకాల సేకరణలో దేశవ్యాప్తంగా అతిరధ మహారధులు పాల్గొంటున్నారు..ఏడుకొండలవాడి  సాక్షిగా చేపట్టిన ఈ కార్యక్రమం తొలిరోజే చిన్న జీయర్ స్వామీజీ, మై హోం గ్రూప్ అధినేత డా. జూపల్లి రామేశ్వర రావు తమ సంతకాలు చేసి, సంతకాల సేకరణ ఉద్యమానికి తమ సంఘీభావం తెలియజేశారు..ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, సంతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు..రెండు నెలల పాటు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించబోతున్నామని, కోటి సంతకాలు పూర్తి చేసి గౌరవ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీడీ రూపంలో అందజేస్తామని యుగ తులసి చైర్మన్ కొలిశెట్టి శివ కుమార్ తెలియజేసారు. ఈ సంవత్సరమే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒక సాధనంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు..

Spread the love