Recent Posts

క్యాపుల్స్ రూపంలో కడుపులో వుంచుకుని స్మగ్లింగ్ చేస్తున్న కొకైన్ స్వాధీనం-మహిళ అరెస్ట్

అమరావతి: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉగాండా నుంచి వచ్చిన ప్రయాణికురాలి దగ్గర నుంచి 992 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..4 రోజుల క్రిందట ఉగాండ నుంచి వచ్చిన మహిళ,ఎయిర్ పోర్టు నుంచి వెలుపలకు వెళ్లె సమయంలో,అమె కదలికలు అనుమానస్పదంగా వుండడంతో,కస్టమ్స్ అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు..అమెను తరచి తరచి ప్రశ్నించగా,తాను 91 కొకైన్ క్యాప్సూల్ ను మింగి వున్నట్లు తెలిపింది.కడపులో వున్న కొకైన్ క్యాప్సూల్ పగిలినట్లయితే,అమె ప్రాణంకు ప్రమాదం వుంటుందని తెలిసిన అధికారులు,ఢిల్లీలోకి RML(రామ్ మనోహర్ లోహియా) ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు,క్యాపుల్స్ పద్దతిలో అమె కడుపు నుంచి కొద్ది కొద్దిగా క్యాపుల్స్ ను బయటకు తీశారు.ఇది దాదాపు 992 గ్రాముల బరువు వున్నట్లు నిర్దారించారు.ఈ సందర్బంలో కాస్టమ్స్ అధికారులు మాట్లాడుతూ కడుపులో 400-500 గ్రాముల వరకు క్యాపుల్స్ పెట్టుకుని,స్మగ్లింగ్ చేస్తుంటారని,అయితే సదరు మహిళ ఏకంగా 992 గ్రాముల క్యాపుల్స్ స్మగ్లింగ్ చేయడం IGI (ఇందిరా గాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు) లో ఇది రెండో సంఘటన అన్నారు..పట్టుబడిన మహిళపై NDPS చట్టంలోని సెక్షన్ 43b కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు..డిశంబరు 9వ తేదిన పట్టుబడిన మరో మహిళ నుంచి 2838 కేజిల కొకైన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.ఈ సంవత్సరం ఇందిరా గాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో దాదాపు 32 మంది డ్రాగ్స్ స్మగ్లర్స్ ను పట్టుకుని స్వాధీనం చేసుకున్న డ్రాగ్స్ విలువ దాదాపు రూ.845 కోట్లు వుంటుందన్నారు..

Spread the love
error: Content is protected !!