Recent Posts

చార్‌ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సీ.ఎం తీర‌థ్ సింగ్ రావ‌త్

అమరావతి: కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది..ఈ సంవత్సరం కేవలం నాలుగు దేవాలయాల అర్చకులు మాత్రమే పూజలు,, ఇతర సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను నిర్వహిస్తారని ముఖ్య‌మంత్రి తీర‌థ్ సింగ్ రావ‌త్ వెల్ల‌డించారు..మే 14 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది..ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్,,కేదార్‌నాథ్,, గంగోత్రి,, యమునోత్రిలను కలిపి చార్‌ధామ్ అంటారు..కుంభ‌మేళా కారణంగా రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి..ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ప్రత్యేకంగా సమావేశ‌మై సీ.ఎం, చార్‌ధామ్ యాత్ర‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించారు..

Spread the love