Recent Posts

నెల్లూరుజిల్లాలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన సీ.ఎం జగన్

నెల్లూరు: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, తొలుత నెల్లూరు రూరల్ మండల పరిధిలోని నెల్లూరు-ములుముడి, తాటిపర్తి రోడ్డు దేవరపాలెం వద్ద దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్డును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దెబ్బతిన్న రోడ్డు పరిస్థితిని వివరించారు.రూ.18 లక్షల 50 వేల రూపాయలతో ఈ రోడ్డును తాత్కాలికంగా పునరుద్ధరించడం జరిగిందని, శాశ్వత మరమ్మతులు కోసం 50 లక్షల రూపాయలు అవసరం అవుతుందని, ప్రతిపాదనలు పంపినట్లు ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు.అనంతరం జొన్నవాడ వద్ద దెబ్బ తిన్న పెన్నా నది పొర్లుకట్టను, పంటలను ముఖ్యమంత్రి పరిశీలించారు.వరద పరిస్థితిని, జరిగిన నష్టం గురించి కోవూరు ఎమ్మేల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ముఖ్యమంత్రికి వివరించారు.

Spread the love
error: Content is protected !!