Recent Posts

సినిపరిశ్రమ సమస్యలపై సీ.ఎం జగన్  సానుకూలంగా స్పందించారు-చిరంజీవి

అమరావతి: సీ.ఎం జగన్ తో జరిగిన ఈ సమావేశం సంతృప్తికరంగా సాగింది.పండగ పూట సోదరుడిగా పిలిచి విందు భోజనం పెట్టి,ఆప్యాయతని చూపెట్టారు.వారితో కలిసి లంచ్ చేశాను.సినిమా సమస్యలపై చర్చించాను అని మెగా స్టార్ చిరంజీవి అన్నారు.గురువారం హైదరాబాద్ నుంచి చార్టర్డ్ ఫ్లైయిట్ లో తాడేపల్లికి చేరుకున్న మెగాస్టార్,,సీ.ఎం జగన్ తో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ  కొన్ని నెలలుగా ఈ చర్చలు జరుగుతున్నాయి. చాలా మందికి ప్రభుత్వం తీసుకున్న గత నిర్ణయాల పై అసంతృప్తి ఉంది. ఎవరెవరో ఏదేదో మాట్లాడటం వల్ల సమస్య రోజు రోజుకి జఠిలమవుతుంది. అందుకే నన్ను జగన్ పిలిచారు. మీరు వచ్చి మీ సమస్యని చెప్పండి అని అన్నారు. మీరు చెప్పింది కూడా విని మీ సమస్యలని పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటాను అని తెలిపారు.సామాన్య ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న సమస్యని వివరించాను. ఆ సమస్యలకి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ ఓ నివేదికని తయారు చేస్తుంది. గ్లామర్ ఫీల్డ్ బయటకి కనిపించినంత కలర్ ఫుల్ గా ఉండదు. ఎంతో మంది వెనకాల కార్మికులు కష్టపడతారు. కరోనా టైంలో సినీ కార్మికులు చాలా కష్టాలు పడ్డారు. కరోనా టైంలో వాళ్ళ కోసం ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేశాం. సినీ పరిశ్రమలో కార్మికులు చాలా మంది ఉన్నారు. థియేటర్స్ కూడా మూసెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ సమస్యల్ని కూడా మాట్లాడాను.సీ.ఎం జగన్  సానుకూలంగా స్పందించారు. మీరు వచ్చి చెప్పారు. నేను అందర్నీ సమ దృష్టితో చూస్తాను. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నాకు ధైర్యం వచ్చింది. త్వరలో కమిటీ తుది నివేదిక చేసిన తరువాత ఇండస్ట్రీని పిలిచి మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటాను అని మంచి మాట చెప్పారు..నేను ఇండస్ట్రీ పెద్దగా రాలేదు.ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను.ఇండస్ట్రీ బిడ్డగా అందరికి ఒకటే చెప్తున్నాను ఎవరూ తొందరపడి అభద్రతా భావంతో మాటలు జారొద్దు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు, స్టేట్మెంట్స్ ఇవ్వకండి.సీ.ఎం జగన్ తమంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ నెల లోపు చెప్తారు. చిన్న సినిమాలు అయిదవ షో ఉండాలని అడిగారు.అది కూడా అడిగాను.నేను ఇచ్చిన సూచనల్ని అన్నిటిని తీసుకున్నారు.ఈ మీటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది.జగన్, నాకు చెప్పినవన్నీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం పెట్టి అందరికి చెప్తాను.వాళ్ళు చెప్పినవి కూడా అన్ని విని మళ్ళీ జగన్ ని కలుస్తాను. ఈ సారి ఒక్కడిన్నే రమ్మంటే ఒక్కడిన్నే వస్తా. 100 మందితో రమ్మంటే 100 మందితో వస్తాను. త్వరలోనే ఈ సమస్యలను ఫుల్ స్టాప్ పడుతుంద అని భావిస్తున్నాని అని అన్నారు..

Spread the love
error: Content is protected !!