Recent Posts

చిన్నపిల్లల గుండె జబ్బుల చికిత్సల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన సీ.ఎం జగన్

తిరుపతి: బాలల ఆరోగ్య వరప్రదాయని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆసుపత్రిని సీ.ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి లోని బర్డ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు..టిటిడి వారి సౌజన్యంతో చిన్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేసేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ.25 కోట్లతో నిర్మించింది.గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించడానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి లేకుండా, ఈ శస్త్ర చికిత్సలు చేయించే కొనే ఆర్థిక స్థోమత లేని నిరుపేద తల్లిదండ్రుల చిన్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయించాలని ప్రభు త్వం సంకల్పించింది.ఈ నెల 12 వతేది నుండి ఓపి సేవలు ప్రారంభం కాగా… డిసెంబర్ మొదటి వారం నుండి శస్త్ర చికిత్సలు మొదలు కానున్నాయి..ఈ ఆసుపత్రిలో పీడియాట్రిక్ కార్డియాలజీ మరియు పీడియాట్రిక్ కార్డియో తోరాసిక్ సర్జరి విభాగానికి సంబంధించి వైద్యులను నియమించడం జరిగింది..50 పడకలు, 25 పడకల ఐసియు సామర్థ్యంతో మరియు 3 లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, అడ్వాన్స్ కాత్ ల్యాబ్, 3 డి కార్డియో ఎకోగ్రఫీ యంత్రాలు, 12 చానల్ ఈసిజి మెషిన్, పోర్టబుల్ డి2డి ఏకొ కలర్ డాప్లర్ మెషిన్ లతో అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అందిస్తారు..

Spread the love