Recent Posts

ముగిసిన స్పెక్ట్రమ్ వేలం -5G సేవల్ని అందించేందుకు తాజా స్పెక్ట్రమ్ దోహదపడుతుంది-జియో

అమరావతి: దేశంలో 5 సంవత్సరాల తరువాత టెలికమ్ స్పెక్ట్రమ్ వేలం మంగళవారం జరిగింది..స్పెక్ట్రమ్‌ కోసం మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి..ఇందులో అత్యధికంగా రిలయన్స్‌ జియో రూ.57,122 కోట్ల బిడ్లు దాఖలు చేసింది..అలాగే ఎయిర్‌‌టెల్‌ రూ.18వేల 669 కోట్లకు మాత్రమే బిడ్ దాఖలు చేసింది..వొడాఫోన్‌-ఐడియా కేవలం రూ.1993 కోట్లకు బిడ్స్ దాఖలు చేసింది..అత్యధిక స్పెక్ట్రమ్ ను రిలయన్స్‌ జియో దక్కించుకుంది.. ప్రస్తుతం దాఖలైన బిడ్స్ ప్రకారం కేంద్రానికి రూ.77వేల 814కోట్ల ఆదాయం రానుంది..సబ్‌ గిగా హెర్జ్ట్‌ కేటగిరీలో 355.45 మెగా హెర్ట్జ్ మిడ్‌ బ్యాండ్‌‌,,2300 మెగాహెర్జ్ట్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది..భవిష్యత్తులో 5G సేవల్ని అందించేందుకు తాజా స్పెక్ట్రమ్ దోహదపడుతుందని,,కొత్తగా 9 కోట్ల మంది సబ్‌ స్క్రైబర్స్ కు సేవాలు అందిస్తామని పేర్కొంది..అలాగే ప్రతి పట్టణ ప్రాంతానికి తమ నెట్‌వర్క్‌ చొచ్చుకువెళ్లేందుకు అవకాశం లభించిందని,,ధరలు అధికంగా ఉండడం వల్లే 700 మెగా హెర్జ్ట్‌ బ్యాండ్‌కు ఎవరూ బిడ్‌లు దాఖలు చేయలేదని పేర్కొంది..ఐదు సర్కిళ్లలో తాము దక్కించుకున్న స్పెక్ట్రమ్‌ 4G కవరేజ్‌ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేయనుందని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(వీఐఎల్‌) పేర్కొంది..దీంతో మరింత నాణ్యమైన డిజిటల్‌ సేవల్ని అందించడంతోపాటు బిజినెస్ పెరిగే అవకాశం లభించనుందని,,ఒకప్పుడు స్పెక్ట్రమ్‌ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భారత్‌ ఇప్పుడు మిగులు దేశంగా అవతరించిందని తెలిపింది..దీని వెనుక కేంద్ర ప్రభుత్వ కృషి ఉందని,,కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా లక్ష్యానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని పేర్కొంది..ఈ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు వినియోగించుకోవచ్చు..

Spread the love