July 4, 2022

సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా” ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్

అమరావతి: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు నాటకీయ పరిమాణలు చోటు చేసుకున్న నేపధ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది..ఆర్యన్ ఖాన్ కేసు పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చార్జిషీట్ ను దాఖలు చేసింది. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) “సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా” క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా సమాచారం..(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే,,ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించే సమయంలో రెండో కంటికి తెలియకుండా చాలా పకడ్బందిగా రైడ్స్ నిర్వహించారు..అయితే అందులో షారుక్ ఖాన్ కొడుకు వున్నడన్న వార్త బయటకు రాగానే కొన్ని మీడియా సంస్థలు,,రాజకీయ నాయకులకు కొపం కట్టలు తెంచుకుంది..నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అయితే మాత్రం ఏవరి మీద అయిన దాడులు నిర్వహిస్తారా అంటూ మీడియా కెమోరాల ముందు రంకెటు వేశారు..అంతే కాకుండా సమీర్ వాంఖడే కులం,మతం,చదువు అంటూ కేసుకు సంబంధం లేని అతన్ని వ్యక్తిగత జీవితంను బజారుకు లాగారు..అలాగే సమీర్ వాంఖడే బ్లాక్ మెయిల్ కు పాల్పపడుతున్నరంటూ కొంత మంది ఎమ్మేల్యే,,సీనియర్ నాయకులు ఆరోపణలు చేయడం,,ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై  స్పందించి,, సమీర్ వాంఖడేను కేసు దర్యప్తు నుంచి తప్పించడంమే కాకుండా అయనపై ఎదురు కేసు నమోదు చేసి,,దోషిగా నిలబెట్టింది..తనపై వచ్చిన ఆరోపణలను నిరాధారమైనవి అని నిరూపించుకునేందుకు సమీర్ వాంఖడేకు మరో మూడు సంవత్సరాలు పట్టవచ్చు.. సమీర్ వాంఖడే పట్టిన గతిని చూసి మరే ఆధికారి అయిన ఇలాంటి పెద్దవారి(చట్టం ముందు అందరూ సమానులే) పిల్లల జోలికి పోవాలంటే….పోయాల్సిందే..అన్న చందంగా రాజకీయ నేతలు వ్యవహారించారన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది…)
      గతేడాది అక్టోబర్‌లో ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్‌పై దాడిలో డ్రగ్స్ దొరికిన తర్వాత 14 మంది నిందితులను పేర్కొంటూ యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ 6,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అరెస్టయిన 20 మందిలో ఒకరైన బాలీవుడ్ స్టార్ షారుఖాన్ తనయుడు 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌ను నిందితుడిగా పేర్కొనలేదు. ఆర్యన్ మరియు మోహక్ మినహా నిందితులందరూ మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు అని సీనియర్ ఎన్‌సిబి అధికారి సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు..ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఐదుగురికి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను నార్కోటిక్స్ ఏజెన్సీ కనుగొనలేకపోయిందని ఆయన తెలిపారు. చార్జిషీట్లో ఆర్యన్ ఖాన్ పేరు లేకపోవడంతో దీంతో ఆర్యన్ ఖాన్ కు ఈ కేసు నుండి ఉపశమనం లభించినట్లయింది…

Share
error: Content is protected !!