Recent Posts

సీనీ నటుడు కైకాల.సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం!

హైదరాబాద్: ప్రముఖ క్యారక్టర్ ఆరిస్ట్ కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం..ప్రస్తుతం అయన హైదరాబాద్ లోని అపొలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు..గత నెల 30వ తేదిన ఇంట్లో జారిపడటంతో కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు..అప్పటి నుంచి అయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు..అయితే అయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండడంతో,ప్రస్తుతం అయకు వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు..విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తు,,సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి  ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ సినీ అభిమానులు,నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కైకాల.సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు..సినిమాల్లో వస్తే 1959లో కైకాల, సిపాయి కూతురు అనే సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యారు..ఈ తరం దర్శకులతోను పని చేశారు.2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల్లో నటించి మెప్పించారు.కైకాల నటనకు ‘నవరసనటనా సార్వభౌమ’ ‘కళా ప్రపూర్ణ’ ‘నటశేఖర’ లాంటి బిరుదులు వరించాయి.ఆయన ఇప్పటివరకు సుమారు 777 సినిమాల్లో నటించారు. అంతేకాకుండా 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో అభినయించారు.సుమారు 200 మంది దర్శకులతో పని చేశారు.గత రెండు సంవత్సరాలుగా   వెండితెరకు దూరంగా ఉన్నారు..కైకాల మళ్లీ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుందాం..

Spread the love
error: Content is protected !!