Recent Posts

వరద బాధితులకు చిరంజీవీ,రామ్ చరణ్ లు రూ.50 లక్షలసాయం

జూ.ఎస్టీఆర్ రూ.25 లక్షలు..

అమరావతి: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ధాటికి  రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వందలఎకరాల పంటనష్టం,ఇళ్లు కోల్పోవడం,వ్యక్తిగతంగా ఆస్తుల నష్టం జరిగింది..దీంతో వర్షాలు, వరద బీభత్సానికి నష్టపోయిన బాధితులకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు.బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహయనిధికి విరాళంగా ప్రకటించారు..అలాగే తండ్రి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుందనేది మరోసారి నిరూపించుకున్నారు..ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు.ఆయన కూడా బాధితులకు రూ.25 లక్షల సాయం ప్రకటించారు.బాధితులు వరద ముప్పు నుంచి తొందరగా బయట పడాలని ఆకాంక్షించారు..

Spread the love
error: Content is protected !!