Recent Posts

వాట్స్ ఆప్ లో లింక్ పంపించి SBI ఖాతాదారులను దొచేస్తున్న చైనా హ్యకర్లు

అమరావతి: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాతా వున్న వినియోగదారులు ఏ మాత్రం ఆజాగ్రత్తగా వున్న మీ అంకౌంట్ లో వున్న మొత్తంను హ్యకర్లు తుడిచిపెట్టేస్తున్నారంటు SBI హెచ్చరికలు చేస్తుంది..ఇటీవల కాలంలో చైనాకు చెందిన హ్యకర్లు,whatsapp ద్వారా KYC వేరిఫికేషన్ అంటు msg పంపిస్తారు.అందులోని లింక్ ను క్లిక్ చేయగానే అచ్చంగా SBI online పేజిలాగే వుండే పేజ్ ఓపెన్ అవుతుంది..అప్పుడు హ్యకర్లు మనకు ఫోన్ కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మన పేరు,మొబైల్ నెంబరు,పెట్టిన తేది లాంటి వివరాలు ఇవ్వమని సూచిస్తుంది.అవి పూర్తి చేయగానే లాగిన్ బటన్ కన్పిస్తుంది.సదరు బటన్ నొక్కగానే KYC పేజీ ఓపెన్ అయ్యి మన బ్యాంకు అకౌంట్ యూజర్ నేమ్,పాస్ వర్డ్ అడుగుతుంది.ఈ క్రమంలో మనకు ఎక్కడ అనుమానం రాకుండా అచ్చం SBI online పేజిలాగే వుంటాయి.KYC అప్ డేట్ తో పాటు వీళ్లు మరో లింక్ పంపిస్తారు.మీరు సదరు లింక్ ను క్లిక్ చేయగానే కంగ్రాచ్చులేషన్స్ అనే సందేశం కన్పిస్తుంది. SBI online నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొంటే,రూ.50 లక్షలు విలువ చేసే బాహుమతులు గెలుచుకోవచ్చని తెలియచేస్తుంది.మీరు సర్వేలో పాల్గొంటే మీ వ్యక్తిగత వివరాలు అడుగుతుంది.ఇలా సేకరించిన వివరాలతో చైనా హ్యకర్లు మీ అకౌంట్ లో వున్న సొమ్మును పూర్తిగా తుడిపెట్టేస్తారని, SBI ఎప్పుడు కస్టమర్స్ సంబంధించి ఎలాంటి వివరాలను ఫోన్ ద్వారా అడగదని తెలిపింది.ఎట్టి పరిస్థితిలోను ఖాతాదారులు వ్యక్తిగత వివరాలు ఎవ్వరితోను పంచుకోవద్దని హెచ్చిరించిది.కాబట్టి మీరు ఎలాంటి వివరాలు ఎవ్వరితోను పంచుకోవద్దు,ఒక వేళ అలాంటి మేసేజ్ లు వస్తే,మీ దగ్గర్లలోని SBI ని వ్యక్తిగత వెళ్లి సంప్రదించాలని సూచించింది..

Spread the love