Recent Posts

పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ సోమవారం పశ్చిమగోదావరి పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ వ్యూ ద్వారా హెలికాఫ్టర్ నుంచే పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల్నిపరిశీలించిన అనంతరం సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.సీ.ఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అధికారులు, పోలవరం స్పిల్‌వే పనులు దాదాపుగా పూర్తిచేశామని తెలిపారు..48 గేట్లలో 42 గేట్లు అమర్చామని, మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని సీఎంకు తెలిపారు. జర్మనీ నుంచి సిలెండర్లు వచ్చాయని, ఎగువ కాఫర్‌డ్యాంలో గతంలో ఉన్న ఖాళీలను పూర్తిచేశామని వెల్లడించారు..దిగువ కాఫర్‌డ్యాం పనులు పరిస్థితిని కూడా సీఎంకు వారు వివరించారు. ఎర్త్‌ & రాక్‌ఫిల్‌డ్యాం(ECRF) పనులపై అధికారుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాఫర్‌ డ్యాంలో ఖాళీలు కారణంగా గతంలో వచ్చిన వరదలకు ECRF ప్రాంతం దెబ్బతిందని, దీనిపనులు ఎలా చేయాలన్నదానిపై డిజైన్లు కూడా ఖరారు అవుతాయని అధికారులు తెలిపారు..2022 జూన్‌కల్లా లైనింగ్‌తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్‌పనులు, లైనింగ్‌పనులు పూర్తికావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ డిసెంబర్‌ కల్లా తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆతర్వాత మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. పోలవరం R&R పైనా సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాల నుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు వారు వివరించారు..

Spread the love