Recent Posts

వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్

అమరావతి: వ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీ.ఎం జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు..మే 16న రైతు భరోసా, జూన్‌ 15 లోగా రైతులకు పంట బీమా పరిహారం..అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు..402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం అంచేస్తోంది.. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్‌ఏఓ చాంఫియన్‌ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను సీఎం అభినందించారు.. తోట బడి కార్యక్రమంలో మామిడి, అరటిపై కరదీపికను సీఎం విడుదల చేశారు..సమీక్షలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పుడ్‌ ప్రాససింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య,  మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు..

Spread the love
error: Content is protected !!