Recent Posts

అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారి ప్రారంభించిన ముఖ్యమంత్రి

తిరుపతి:  రెండు రోజుల తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం జిల్లా కు చేరుకున్న ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం అలిపిరి వద్ద  ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి..నడక మార్గాన్ని రిబ్బన్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గత కొద్దికాలంగా భక్తులు ప్రవేశం నిలిపివేసి,,రిలయన్స్ ఇండస్ట్రీస్  రూ. 25 కోట్లుతో అలిపిరి నుంచి తిరుమల వరకు వున్న రహదారికి  పైకప్పు నిర్మించారు. పునర్నిర్మించిన పైకప్పు వైష్ణవ సాంప్రదాయంలో అనన్య శరణాగతికి ప్రతీకగా నిలిచిన శ్రీవారి భక్తుల నడకదారి విశేషాలను డిజిటల్ స్క్రీన్ ద్వారా సీ.ఎంకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వివరించారు..

Spread the love