AMARAVATHIPOLITICS

మంత్రులకు శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాడిన తరువాత మంత్రివర్గంలో ఎవరికి ఏయే శాఖలు అనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు శుక్రవారం మధ్యహ్నం 2.15 గంటలకు తెరపడింది..మంత్రుల సమర్దతను దృష్టిలో వుంచుకుని,, ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా కేటాయించారు..జనసేన అధినేత పవన్ కల్యాణ్,,నారా లోకేష్‌లకు కీలక శాఖలు కేటాయించారు..ఇక హోం మంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించారు.

1-నారా చంద్రబాబు-ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్.

2-పవన్ కల్యాణ్-డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు.

3-వంగలపూడి అనిత-హోం మంత్రిత్వ శాఖ.

4-పయ్యావుల కేశవ్‌-ఆర్థిక శాఖ.

5-నారా లోకేష్‌-మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు.

6-పొంగూరు నారాయణ-పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి.

7-అచ్చెన్నాయుడు-వ్యవసాయశాఖ.

8-నాదెండ్ల మనోహర్‌-ఆహారం, పౌరసరఫరాల శాఖ.

9-సత్యకుమార్‌ యాదవ్‌-ఆరోగ్యశాఖ.

10-నిమ్మల రామానాయుడు-నీటిపారుదల శాఖ.

11-మహ్మద్‌ ఫరూఖ్‌-న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం.

12-ఆనం రామనారాయణరెడ్డి-దేవాదాయ శాఖ.

13-అనగాని సత్యప్రసాద్‌-రెవెన్యూ శాఖ.

14-కొలుసు పార్థసారథి-హౌసింగ్‌, I &PR శాఖలు.

15-డోలా బాలవీరాంజనేయస్వామి-సాంఘిక సంక్షేమ శాఖ.

16-గొట్టిపాటి రవికుమార్‌-విద్యుత్‌ శాఖ.

17-కందుల దుర్గేష్‌-పర్యాటకం, సాంస్కృతిక శాఖలు.

18-గుమ్మడి సంధ్యారాణి-స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు.

19-బీసీ జనార్థన్‌-రహదారులు, భవనాల శాఖలు.

20-టీజీ భరత్‌-పరిశ్రమల శాఖ.

21-ఎస్‌.సవిత-బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌ టైల్స్‌ శాఖలు.

22-వాసంశెట్టి సుభాష్‌-కార్మిక, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌.

23-కొండపల్లి శ్రీనివాస్‌-MSME, సెర్ప్‌, NRI ఎంపవర్‌మెంట్‌ శాఖలు.

24-మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి-రవాణా, యువజన, క్రీడా శాఖలు కేటాయించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *