Recent Posts

పంజాబ్ నూత‌న ముఖ్య‌మంత్రిగా చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ..సుఖ్‌జింద‌ర్ సింగ్ ర‌న్‌ధ‌వా?

అమరావతి: పంజాబ్ నూత‌న ముఖ్య‌మంత్రిగా సుఖ్‌జింద‌ర్ సింగ్ ర‌న్‌ధ‌వాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది..అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా త‌రువాత పంజాబ్ రాజ‌కీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి.. అనేక‌ మంది పేర్ల‌ను ప‌రిశీలించిన అధిష్టానం సుఖ్‌జింద‌ర్ సింగ్ ర‌న్‌ధ‌వాను ఎంపిక చేసింది.ఈ మేర‌కు ఏఐసీసీ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది..కాసేప‌ట్లో కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం స‌మావేశం అయ్యి ర‌న్‌ధ‌వాను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకోనున్నారు..అనూహ్యంగా తెరపైకి చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీ:-పంజాబ్ సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ చ‌న్నీని నియ‌మిస్తున్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించారు. కొద్దిసేప‌టి క్రితం పంజాబ్ సీఎంగా సుఖ్‌సింద‌ర్ సింగ్ ర‌ణ్‌ధవా ను ఎంపిక చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.  ప్ర‌స్తుతం ర‌ణ్‌ధ‌వా పంజాబ్ కేబినెట్ మంత్రిగా ప‌నిచేస్తున‌న్నారు.ఆయ‌న నియామ‌కం దాదాపుగా ఖ‌రారైంద‌ని, అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అనుకుంటున్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ మ‌రో ట్విస్ట్ ఇచ్చింది.  పంజాబ్ సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ స‌న్నీని ఎంపిక చేసిన‌ట్టుగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావ‌త్ ప్ర‌క‌టించారు.

Spread the love